ఇందులో 4 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.15,499 కాగా... 6 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.16,999గానూ, 8 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.17,999గానూ నిర్ణయించారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో కొంటే రూ.2,000 వరకు తగ్గింపు లభించనుంది.
ఇందులో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు పెంచుకోవచ్చు.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
వెనకవైపు 50 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ కెమెరాలను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.