పంజాబీ అమ్మాయే అమెరికాలో అందగత్తె శ్రీ షైనీ అమెరికా తరపున మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంది. ప్రవాస భారతీయురాలైన శ్రీ షైనీ అయిదేళ్ల వయసులోనే అమెరికా వెళ్లిపోయింది. ఆమెకు అమెరికా పౌరసత్వం ఉంది. అందుకే అక్కడ అందాల పోటీల్లో పాల్గొన్ని ‘మిస్ అమెరికా వరల్డ్’గా నిలిచింది. అందుకే అమెరికాకు ప్రాతినిథ్యం వహిస్తూ ‘మిస్ వరల్డ్’ పోటీల్లోనూ పాల్గొంది. మిస్ వరల్డ్ పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది. ఆమె తనను వందశాతం అమెరికన్ అని, అలాగే వందశాతం ఇండియన్ అని కూడా చెప్పుకుంటుంది. శ్రీ షైనీ తల్లిదండ్రులది పంజాబ్ లోని లూథియానా. లూథియానాలోనే ఆమె చుట్టాలు ఎందరో ఉన్నారు. Image Credit: Shree saini/Instagram