శివపూజలో ఈ 8 నామాలు చాలా ముఖ్యం!

శివుడికి ఎనిమిది పేర్లు ఉన్నాయి. వాటిని శివ అష్టనామాలు అంటారు

శివాయనమః
సర్వమందు మంగళము కలిగించువాడా నీకు నమస్కారం.

మహేశ్వరాయనమః
తిరోధాన కర్తవైన స్వామీ నీకు నమస్కారం

రుద్రాయనమః
వర్తమాన సర్వాపన్నివారకుడైన పరమాత్మ! నీకు నమస్కారం.

విష్ణవే నమః
సర్వేసర్వత్రా వ్యాపించు యున్నవాడా! నీకు నమస్కారం

పితామహాయ నమః
సర్వులకూ మూలకారకుడైనవాడా! నీకు నమ స్కారం.

సంసారభిషజే నమః
ప్రాపంచిక రోగాలనూ ఉపశమింపచేసే వైద్యుడవైన తండ్రీ! నీకు నమస్కారం

సర్వజ్ఞాయ నమః
సృష్టి, లయకారకమువు అయిన సర్వేశ్వరా నీకు నమస్కారం

పరమాత్మనే నమః
సమస్తానికి అతీతుడైన పరమేశ్వరుడికి నమస్కారం
Images Credit: Pinterest