SBI 'అమృత్ కలశ్' స్కీమ్ తీసుకొచ్చింది. షార్ట్ టర్మ్‌లో మంచి వడ్డీ కోరుకొనేవాళ్లకు ఇది అనువైన FD స్కీమ్. SBI అమృత్ కలశ్ పథకం టైమ్ పరియడ్ 400 రోజులు. సీనియర్ సిటిజన్లకు ఏటా 7.6, సాధారణ పౌరులకు 7.1 శాతం వడ్డీ రేటు ఇస్తుంది. ఎస్‌బీఐ ఉద్యోగులు, పెన్షనర్లకు అదనంగా ఒక శాతం వడ్డీరేటు SBI ఆఫర్ చేస్తోంది. ఐదు లక్షలు డిపాజిట్ చేస్తే సీనియర్ సిటిజన్‌కు రూ. 43,000, సాధారణ పౌరుడికి రూ.40,085 వడ్డీ వస్తుంది. బ్యాంకుకు వెళ్లి లేదా యోనో SBI YONO యాప్ ద్వారా FD ఓపెన్ చేయొచ్చు. మెచ్యూరిటీ కన్నా ముందుగానే రద్దు చేసుకోవచ్చు. ఈ డిపాజిట్‌పై బ్యాంక్ లోన్ వస్తుంది. వడ్డీపై TDS కట్ అవుతుంది. దీనిని ఐటీఆర్ ఫైలింగులో క్లెయిమ్ చేసుకోవచ్చు. రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాల్లో ఉండే దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్లు, NRI రూపాయి టర్మ్ డిపాజిట్లు రెండింటికీ ఈ పథకం వర్తిస్తుంది.