నిఫ్టీ 30 పాయింట్లు పెరిగి 19,465 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 137 పాయింట్లు పెరిగి 65,539 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్ 144 పాయింట్లు తగ్గి 43,946 వద్ద క్లోజైంది. అపోలో హాస్పిటల్స్, ఇన్ఫీ, అల్ట్రాటెక్ సెమ్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్ షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్, హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 83.27 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాముల ధర రూ.110 తగ్గి రూ.59,400 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.200 పెరిగి రూ.73000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.280 తగ్గి రూ.23,870 వద్ద ఉంది. బిట్ కాయిన్ ₹ 24,26,409 వద్ద ఉంది.