రిస్క్ ఉండని ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్లలో ఫిక్స్‌డ్ డిపాజిట్‌ ఒకటి. ప్రస్తుతం బ్యాంక్‌ ఇంట్రెస్ట్‌ రేట్లు పీక్‌ స్టేజ్‌లో ఉన్నాయి.

మంచి వడ్డీ ఆదాయం, ఈజీగా ఉండే విత్‌డ్రా రూల్స్‌, మనకు నచ్చిన టైమ్‌ పిరియడ్‌ ఎంచుకునే వెసులుబాటు వంటివి FDల్లో ఉండే బెనిఫిట్స్‌.

పోస్ట్ ఆఫీస్‌లోనూ సేవింగ్స్‌ కమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్కీమ్స్‌ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌ రూపంలో, వివిధ టైమ్‌ టెన్యూర్స్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్‌ను పోస్టాఫీస్‌లు అమలు చేస్తున్నాయి.

SBIలో FD టెన్యూర్ ‍‌7 రోజుల నుంచి 10 సంవత్సరాలు. పోస్టాఫీస్‌ TD 1, 2, 3, 5 సంవత్సరాల కాలానికే అందుబాటులో ఉంటాయి.

SBI ఎఫ్డీలపై 3-7 శాతం, పోస్టాఫీస్ TDలపై 6.8 - 7.5 శాతం మధ్య వడ్డీ ఇస్తున్నాయి.

POTDs - ఏడాది కాల పరిమితికి వడ్డీ 6.80%; రెండేళ్ల కాలానికి వడ్డీ 7%; మూడేళ్ల కాలానికి వడ్డీ 7%; ఐదేళ్ల కాలానికి వడ్డీ 7.5%

SBI FDs- ఏడాది కాల పరిమితికి వడ్డీ 6.90%; రెండేళ్ల కాలానికి వడ్డీ 7%; మూడేళ్ల కాలానికి వడ్డీ 6.50%; ఐదేళ్ల కాలానికి వడ్డీ 6.50%

స్టేట్‌ బ్యాంక్‌, పోస్ట్ ఆఫీస్ రెండూ ఆదాయపు పన్ను ప్రయోజనాలను అందిస్తున్నాయి.

పోస్టాఫీసులో అవసరమైతే ముందే డబ్బు విత్‌డ్రా చేయొచ్చు. ఏడాది తర్వాత క్లోజ్‌ చేస్తే వడ్డీలో కోత పెడతారు.

SBI FDని ముందుగానే విత్‌డ్రా చేసుకోవచ్చు. FDని బట్టి 0.50 - 1 శాతం వరకు వడ్డీ తగ్గించి ఇస్తారు.