ఈ ఏడాది స్టాక్‌ మార్కెట్లు ఓవర్‌ స్పీడ్‌తో పైకి వెళ్తున్నాయి. అదే స్పీడ్‌తో కిందకు వస్తున్నాయి.

మార్కెట్లు పెరిగినా, అనిశ్చితిలో ఉన్నా హైబ్రిడ్ ఫండ్స్ పనితీరు మెరుగ్గా ఉంటోంది.

ప్పాన్ ఇండియా మల్టీ అసెట్ ఫండ్, నిప్పాన్ ఇండియా ఈక్విటీ హైబ్రిడ్ వంటి ఫండ్స్‌ వరుసగా 16.43 శాతం, 18.74 శాతంతో స్ట్రాంగ్‌ రిటర్న్స్‌ ఇచ్చాయి.



హెచ్‌డీఎఫ్‌సీ మల్టీ అసెట్ ఫండ్, టాటా మల్టీ అసెట్ ఫండ్ రాబడులు వరుసగా 13.98 శాతం, 15.25 శాతం లాభాలను పంచాయి.

బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్లలో... ICICI ప్రుడెన్షియల్, సుందరం వరుసగా 10.94%, 11.06% రాబడి తీసుకొచ్చాయి.

ఇన్వెస్టర్లకు రిటర్న్స్‌ ఇచ్చే రేస్‌లో, ఓవరాల్‌ మార్కెట్‌ను హైబ్రిడ్ ఫండ్స్‌ ఓవర్‌టేక్‌ చేశాయి.

స్టాక్ మార్కెట్ల అస్థిరత, ఆందోళన ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు హైబ్రిడ్ ఫండ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు.

హైబ్రిడ్ ఫండ్స్ ఈక్విటీ & డెట్ రెండింటిలోనూ, కొన్ని సందర్భాల్లో బంగారం, వెండి వంటి కమొడిటీస్‌లోనూ పెట్టుబడి పెడతాయి.

అంటే హైబ్రిడ్ ఫండ్‌లో పెట్టే ఒకే పెట్టుబడితో.. విభిన్నమైన పోర్ట్‌ఫోలియో బెనిఫిట్స్‌ లభిస్తాయి.

డైవర్సిఫైడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటెజీ కారణంగా హైబ్రిడ్ ఫండ్స్‌ స్థిరమైన, బ్యాలెన్స్‌డ్‌ రిటర్న్స్‌ అందిస్తాయి. రిస్క్‌ కూడా తక్కువగా ఉంటుంది.