సమంత సినీ రంగంలోకి అడుగుపెట్టి నేటికి (ఫిబ్రవరి 26) 13 సంవత్సరాలు పూర్తయ్యాయి.

2010లో ఇదే రోజు తన మొదటి సినిమా ‘ఏ మాయ చేశావే’ విడుదల అయింది.

మొదటి సినిమాతోనే సమంత స్టార్ స్టేటస్‌ను సంపాదించింది.

వెంటనే మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌లతో నటించే అవకాశం దక్కించుకుంది.

వరుసగా పెద్ద హీరోలతోనే నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

2017లో నాగ చైతన్యను వివాహం చేసుకుంది.

అయితే నాలుగు సంవత్సరాలకే వీరు విడాకులు తీసుకున్నారు.

పెళ్లయ్యాక కూడా సమంత సినిమాల్లో నటించింది.

‘ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్‌తో ఓటీటీ స్పేస్‌లోకి కూడా అడుగు పెట్టింది.

గతేడాది యశోద సినిమాతో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకుంది.