ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త జీటీ నియో 3 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది.
ఈ ఫోన్ రెండు బ్యాటరీ వేరియంట్లలో లాంచ్ అయింది.
వీటిలో ఒకటి 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 150W ఫాస్ట్ చార్జింగ్ సామర్థ్యంతో రానుండగా... మరొకటి 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీతో రానున్నాయి.
ఇక 150W మోడల్ ధర 2,599 యువాన్ల (సుమారు రూ.31,200) నుంచి ప్రారంభం కానుంది.
రియల్‌మీ జీటీ నియో 3 80W వెర్షన్ ధర 1,999 యువాన్ల నుంచి (సుమారు రూ.24,000) ప్రారంభం కానుంది.
4500 ఎంఏహెచ్ బ్యాటరీ వేరియంట్‌లో 150W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందించారు. ఇక 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వేరియంట్‌లో 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండనుంది. 150W ఫాస్ట్ చార్జింగ్ వేరియంట్ కేవలం ఐదు నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ ఎక్కనుంది.
ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది.