మేషం జీవిత భాగస్వామికి ఇచ్చిన మాటను నెరవేర్చగలుగుతారు. ఈరోజు పాత అప్పులు తీర్చే ప్రయత్నం చేస్తారు.తలపెట్టిన ప్రతిపనిలో సక్సెస్ అవుతారు.అడగకుండా ఎవరికీ సలహా ఇవ్వకండి.
వృషభం రోజంతా బిజీ బిజీగా ఉంటారు. మీ దినచర్య పట్ల అజాగ్రత్తగా ఉండకండి.ఇంట్లో అందరిమధ్యన ఉన్నప్పటికీ ఒంటరిగా ఫీలవుతారు.అధికవేడికి బాధితులు కాకుండా చూసుకోండి. ఇతరులపై మీ అభిప్రాయాలు రుద్దొద్దు.
మిథునం వ్యాపారంలో అనుకున్నదానికంటే ఎక్కువ లాభం ఉంటుంది. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. పెద్ద ప్రాజెక్ట్‌లో డబ్బు పెట్టుబడి పెట్టొచ్చు. వైవాహిక జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు.
కర్కాటకం మీరు రిలాక్స్‌గా ఉంటారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. పిల్లల భవిష్యత్తుపై ఆందోళన ఉంటుంది. మీరు షేర్ మార్కెట్‌లో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. పనికిరాని వాటిపై ఎక్కువ శ్రద్ధ పెట్టకండి.
సింహం ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉండొచ్చు. మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. విద్యార్థులు కొత్త సబ్జెక్టులపై ఆసక్తి కనబరుస్తారు. కుటుంబంతో సమయం గడుపుతారు.మీరు మీ మాటలతో అందర్నీ మెప్పించగలరు.
కన్య మీరు ఇల్లు కొనాలనే ఆలోచన చేస్తారు. వ్యాపార ఒత్తిడిని ఇంటిపై పడకుండా చూసుకోండి. మీరు విశ్వసించే వారు మిమ్మల్ని మోసం చేస్తారు.అందరినీ గుడ్డిగా నమ్మొద్దు.
తుల కెరీర్లో జోరు పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయాల్లో ఉండేవారికి ఎదుగుదల ఉంటుంది. దంపతుల మధ్య అన్యోన్యత ఉంటుంది. మీకు సంబంధించిన విషయాలు మీరే ఆలోచించి నిర్ణయించుకోండి.
వృశ్చికం విద్యార్థులకు టెన్షన్ పెరుగుతుంది. బంధువులను కలుస్తారు. ఆరోగ్యంపై దృష్టి సారించండి.వ్యాపారం అంతగా సాగదు. బంధువులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి.
ధనుస్సు ఎప్పటినుంచో చేతికందాల్సిన మొత్తం అందుతుంది.వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. ఇంటర్వ్యూలో విజయం సాధించే అవకాశం ఉంది. మీరు ఎలాంటి బాధల నుంచి అయినా ఉపశమనం పొందుతారు.
మకరం మీరు వ్యాపారంలో నష్టపోవాల్సి రావొచ్చు. అనియంత్రిత ఆహారం ఆరోగ్య సమస్యలను తెస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. కొంత డబ్బుకు సంబంధించిన సమస్య ఉంటుంది.
కుంభం ఇంటా-బయటా గౌరవం పెరుగుతుంది.ఆరోగ్యం చాలా బాగుంటుంది. సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు.పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఇనుము వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తుల ఆదాయం పెరుగుతుంది.
మీనం విద్యార్థులు ప్రయోజనం పొందుతారు..పరీక్షల్లో విజయం సాధిస్తారు. పనికిరాని పనులతో సమయాన్ని వృథా చేయకండి. వినోదం కోసం ఖర్చు చేస్తారు.టెన్షన్ తగ్గుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.