టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది రష్మిక మందన్నా కన్నడ బ్యూటీ అయినప్పటికీ తెలుగులో బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం ఈమె తెలుగుతో పాటు బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేస్తోంది. 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకుంది రష్మిక. దీంతో ఈమెకి అన్ని ఇండస్ట్రీల నుంచి అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. 'గుడ్ బై' సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది రష్మిక. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.