మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా 'బబ్లీ బౌన్సర్'. ఎలా ఉందో చూడండి. కథ: బబ్లీ (తమన్నా) టెన్త్ ఫెయిల్ అమ్మాయి. తండ్రి పహిల్వాన్ కావడంతో వెయిట్ లిఫ్ట్స్ చేయడం మీద పెట్టిన దృష్టి చదువు మీద పెట్టలేదు. ఇంట్లో చూస్తున్న పెళ్లి సంబంధాలను తప్పించుకోవడం కోసం ఉద్యోగం పేరుతో ఢిల్లీ వెళుతుంది. ఢిల్లీలోని క్లబ్‌లో లేడీ బౌన్సర్‌గా జాయిన్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఏంటి? అనేది మిగతా సినిమా. ఎలా ఉందేంటి? : పేరుకు తమన్నాది లేడీ బౌన్సర్ రోల్ కానీ... బౌన్సర్ డ్యూటీ చేస్తున్నట్లు ఎక్కడా కనిపించదు. రెగ్యులర్ రొటీన్ కథను హీరోయిన్ యాంగిల్ నుంచి చెప్పారు తప్ప... దర్శకుడు మధుర్ బండార్కర్ ఎక్కడా కొత్త సీన్లు తీయలేదు. 'బబ్లీ బౌన్సర్'లో ఇటు కామెడీ గానీ... అటు ఎమోషన్స్ గానీ వర్కవుట్ కాలేదు. తమన్నా తన పాత్రకు న్యాయం చేశారు. కానీ, రొటీన్ కథ - కథనాల ముందు ఆమె నటన ఎలివేట్ కాలేదు. కామెడీ కోసమైనా, ఎమోషన్స్ కోసమైనా 'బబ్లీ బౌన్సర్' కంటే టీవీలో కామెడీ రియాలిటీ షోస్, సీరియల్స్ చూడటం బెటర్.