బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్ క్రేజీ ప్రాజెక్టులో వస్తున్న రూమర్లను కొట్టిపారేశాడు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్‌లో రణ్‌బీర్ నటించనున్నాడని వార్తలు వచ్చాయి. దీనిపై రణ్‌బీర్ కపూర్ స్పందించాడు. ఆ సినిమాలో నటించాలనే అనే ఆఫర్ తన వద్దకు రాలేదన్నాడు. ప్రస్తుతం రణ్‌వీర్ ‘తూ జూటీ మై మక్కర్’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. మార్చి 8వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో రణ్‌బీర్ సరసన శ్రద్ధా కపూర్ యాక్ట్ చేసింది. సందీప్ వంగా దర్శకత్వంలో ‘యానిమల్’ సినిమాలో కూడా రణ్‌బీర్ నటిస్తున్నాడు. ఆగస్టు 11వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.