‘రాధేశ్యామ్’, ‘బీస్ట్’, ‘ఆచార్య’.. వరుస ఫ్లాప్‌లతో హ్యాట్రిక్ కొట్టిన పూజా హెగ్డే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. తొలిసారిగా పూజా హెగ్డే ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’లో పాల్గొంది. పెద్ద గౌనులో కేన్స్ రెడ్ కార్పెట్‌పై బుట్టబొమ్మ అడుగులు వేస్తూ సందడి చేసింది. పూజా ‘F3’ సినిమాలో స్పెషల్ అప్పీయరెన్స్ ఇవ్వనుంది. ‘F3’లో పూజా చేసిన ‘‘లైఫ్ అంటే ఇట్టా ఉండాల’’ స్పెషల్ సాంగ్ ఇటీవలే విడుదలైంది. దేవిశ్రీ సంగీతం అందించిన ఈ పాటకు మాంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం పూజాకు తెలుగులో త్రివిక్రమ్ సినిమా ఒక్కటే ఉంది. హిందీలో సల్మాన్ ఖాన్‌తో ‘కబీ ఈద్ కబీ దీవాళీ’, రణ్‌వీర్‌తో ‘సర్కస్’ చిత్రంలో నటిస్తోంది. రానున్న సినిమాలు కూడా ఫ్లాప్ అయితే, పూజా దుకాణం సర్దేయాల్సిందేనని ఇండస్ట్రీలో టాక్. మరి బుట్ట బొమ్మ లక్ ఎలా ఉంటుందో చూడాలి. ‘కేన్స్’లో పూజా హెగ్డే తొలిరోజు ఇలా ముస్తాబైంది. (వీడియో) Images and Video Credit: Pooja Hegde/Instagram