మీన రాశి వారఫలాలు ( డిసెంబరు 10 - 16) మీన రాశి వారికి వారం ప్రారంభంలో మీరు అనుకున్నవన్నీ నెరవేరతాయి. సంతానానికి సంబంధించిన కొన్ని ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారు. మీ కెరీర్-వ్యాపార అవకాశాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు గౌరవం పెరుగుతుంది. ఈ వారం మీకు అదనపు ఆదాయ వనరులు ఏర్పడతాయి. అధిక ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. విలాసవంతమైన వస్తువులపై ఎక్కువ ఖర్చు చేస్తారు. రాజకీయాలలో ఉన్నవారికి కలిసొచ్చే సమయం. వారం మధ్యలో తల్లిదండ్రుల సహకారంతో మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. కెరీర్-బిజినెస్ లేదా వ్యక్తిగత జీవితంలో తీసుకున్న నిర్ణయాల ప్రయోజనాలు భవిష్యత్తులో కనిపిస్తాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.