కుంభ రాశి వారఫలాలు ( డిసెంబరు 10 - 16) కుంభ రాశివారికి వారం ప్రారంభం మిశ్రమంగా ఉంటుంది. కుటుంబ సంబంధిత సమస్యను ఎదుర్కోవలసి రావొచ్చు. కెరీర్, వ్యాపారం లేదా కుటుంబ విషయాలు అయినా ఏదైనా సమస్య పరిష్కార సమయంలో శ్రేయోభిలాషుల సలహాను విస్మరించవద్దు లేదంటే మీరు తర్వాత పశ్చాత్తాపపడవచ్చు. ఉద్యోగం చేస్తున్న వారు నూతన అవకాశాలు పొందుతారు...కానీ నిర్ణయం తీసుకునేముందు లాభనష్టాలను బేరీజు వేసుకోండి. వారం మధ్యలో వ్యాపార పర్యటనకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఆహారం , ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఎంత కష్టపడినా మీరు ఆశించిన విజయం కోసం కొంచెం వేచి ఉండవలసి ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సమయం కేటాయిస్తారు. ఈ వారం సాధారణంగా ప్రేమ సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ భాగస్వామితో బంధం బలపడుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. Images Credit: Pixabay