తులారాశి వారఫలాలు ( డిసెంబరు 10 - 16) తులా రాశి వారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ శ్రమకు పూర్తి ఫలితం లభిస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు ఈ వారం పూర్తిచేస్తారు. ఆస్తి, కుటుంబానికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యులతో ఉండే విభేదాలు సమసిపోతాయి. బంధువులతో సంబంధాలు బలపడతాయి. వ్యాపార సంబంధిత ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ప్రభుత్వానికి లేదా అధికారానికి సంబంధించిన పనులు పూర్తవుతాయి. రచనా రంగంలో ఉండేవారికి ఈ వారం కలిసొస్తుంది. నిరుద్యోగులు సౌకర్యవంతమైన ఉద్యోగాల్లో స్థిరపడతారు. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. . ప్రేమ భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. పెళ్లి దిశగా ఆలోచన చేసేందుకు ఇదే మంచి సమయం వైవాహిక జీవితం బావుంటుంది. Images Credit: Pixabay