ప్రతి నెలా కేవలం రూ. 10,000 పొదుపు చేయడం వల్ల 20 ఏళ్ల తర్వాత మీరు కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది.

మీరు నెలకు రూ. 10,000 చొప్పున 20 ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే, మీరు మొత్తం జమ చేసే సొమ్ము రూ. 24 లక్షలు.

గటున 12% వార్షిక రిటర్న్స్ వస్తాయని భావిస్తే, 20 ఏళ్ల తర్వాత మీ చేతికి వచ్చే మొత్తం సుమారు రూ. 99.91 లక్షలు

ఒకవేళ మార్కెట్ బాగుండి మీకు 15% రిటర్న్స్ వస్తే, ఆ మొత్తం ఏకంగా రూ. 1.51 కోట్లకు చేరుకుంటుంది.

SIPలో అసలు కంటే వడ్డీపై వచ్చే వడ్డీ వల్ల సంపద విపరీతంగా పెరుగుతుంది.

మీరు 10 ఏళ్లు పెట్టుబడి పెడితే వచ్చే లాభం కంటే, 20 ఏళ్ల వరకు కొనసాగించడం వల్ల వచ్చే లాభం కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది.

ప్రతి నెలా ఒకే మొత్తం పెట్టుబడి పెట్టడం వల్ల, మార్కెట్ పడిపోయినప్పుడు ఎక్కువ యూనిట్లు, పెరిగినప్పుడు తక్కువ యూనిట్లు వస్తాయి.

ఆదాయం పెరిగినప్పుడు SIP మొత్తాన్ని కూడా 5% లేదా 10% పెంచుకుంటూ పోతే లక్ష్యాన్ని ఇంకా ముందే చేరుకోవచ్చు.

20 ఏళ్ల తర్వాత రూ. 1 కోటి విలువ ఇప్పుడున్నంత ఉండకపోవచ్చు. కాబట్టి ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

మ్యూచువల్ ఫండ్లలో రిస్క్ ఉంటుంది, లాంగ్ టర్మ్ పీరియడ్ లో ఆ రిస్క్ తగ్గి మంచి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.