'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ యూట్యూబ్ ఛాన‌ల్‌లో ఒకానొక స‌మ‌యంలో ల‌క్ష మంది వీక్షించారు. ప్రస్తుతం 'సితార'లో ప్రీ రిలీజ్‌ను 36 ల‌క్ష‌ల మంది చూశారు.



నైజాం - 35, సీడెడ్ - 17, ఓవర్సీస్ - 9, రెస్టాఫ్ ఇండియా - 10.50 కోట్ల రూపాయలకు 'భీమ్లా నాయక్' థియేట్రికల్ రైట్స్ విక్రయించారట. టోటల్ రూ. 109.5 కోట్లు.



'భీమ్లా నాయక్' ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ (రూ. 109.5 కోట్లు) పవన్ కల్యాణ్ కెరీర్‌లో సెకండ్ బెస్ట్. 'అజ్ఞాతవాసి'కి రూ. 124 కోట్ల బిజినెస్ జరిగింది.



'భీమ్లా నాయక్' ఓటీటీ రైట్స్ రూ. 70 కోట్లకు అమ్ముడైనట్టు సమాచారం. డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఆహా ఓటీటీలో సినిమా స్ట్రీమింగ్ కానుంది.



అమెరికాలో 'భీమ్లా నాయక్' ప్రీమియర్ కలెక్షన్స్ 600k (రూ. 4.64 కోట్లు) దాటాయి. ప్రీమియర్స్ టోటల్ వన్ మిలియన్ డాలర్స్ దాటుతుందని అంచనా.



ఆస్ట్రేలియా, దుబాయ్, ఇతర విదేశాల్లో కూడా 'భీమ్లా నాయక్'కు మంచి స్పందన లభిస్తోంది.



హైదరాబాద్, తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ అన్ని థియేటర్లలో ఫస్ట్ డే హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేశారు. తొలిరోజు రికార్డ్ కలెక్షన్స్ వస్తాయని చిత్రబృందం ఆశిస్తోంది.



తెలంగాణలో 'భీమ్లా నాయక్'కు ఐదు ఆటలు వేయడానికి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీలో అదనపు ఆటలకు అనుమతి లేదు.