Ullu, Atrangii, Alt Balajiల్లో అడల్ట్ వెబ్ సిరీస్‌ల్లో నటించిన నూర్ మాళవికా దాస్ మృతికి కారణాలు ఏమిటో తెలుసుకోండి.

ముంబైలోని లోఖండవాలాలో గల తన ఫ్లాట్‌లో నూర్ మాళవికా దాస్ ఆత్మహత్య చేసుకుంది.

నూర్ ఫ్లాట్ నుంచి వాసన రావడంతో నైబర్స్ కంప్లైంట్ చేయగా పోలీసులు వచ్చి డోర్స్ ఓపెన్ చేశారు.

కుళ్లిన నూర్ మృతదేహం లభించగా.... ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకుని అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

నూర్ మాళవికా దాస్ అస్సాం అమ్మాయి. ఖతర్ ఎయిర్ వేస్‌లో ఎయిర్ హోస్టెస్‌గా చేసింది నూర్.

నటనపై ఆసక్తితో ముంబై వచ్చి మొదట మోడల్, ఆ తర్వాత యాక్ట్రెస్‌గా కెరీర్ స్టార్ట్ చేశారు.

నటిగా కెరీర్ ఆశించిన రీతిలో లేకపోవడంతో నూర్ మాళవికా దాస్ డిప్రెషన్ లోకి వెళ్లిందని ఆవిడ ఆంటీ చెప్పింది.

బహుశా... డిప్రెషన్ కారణంగా నూర్ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ఆమె ఆంటీ పేర్కొంది.

కొన్నాళ్ల క్రితం నూర్ మాళవికా దాస్ గుండు చేయించుకున్నారు. దానికీ డిప్రెషన్ కారణం అయ్యిండొచ్చు.

నూర్ మృతిపై సమగ్ర దర్యాప్తు చేయించాలని మహారాష్ట్ర సీఎంను ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ కోరింది.

Thanks for Reading. UP NEXT

వెన్నులో వణుకుపుట్టించే జాంబీ సినిమాలు - నెట్‌ఫ్లిక్స్‌లోని టాప్ 7 చిత్రాలపై మీరూ ఓ లుక్కేయండి

View next story