ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ తన కొత్త ఫోన్ వన్‌ప్లస్ 10 ప్రోను మనదేశంలో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ ఇప్పటికే చైనాలో లాంచ్ అయింది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌ను అందించారు. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. 6.7 అంగుళాల క్యూహెచ్‌డీ+ ఎల్టీపీవో అమోఎల్ఈడీ 2.0 డిస్‌ప్లేను ఇందులో అందించారు. ఫోన్ వెనకవైపు 48 + 50 + 8 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.