ఓట్స్ పకోడీ, ఇలా చేస్తే చాలా ఈజీ



ఓట్స్ - ఒక కప్పు
బియ్యం పిండి - అర కప్పు
శెనగ పిండి - అర కప్పు
ఉల్లి తరుగు - అర కప్పు
అల్లం తరుగు - ఒక స్పూను

వెల్లుల్లి రెబ్బలు - నాలుగు
పచ్చిమిర్చి - నాలుగు
కరివేపాకు - గుప్పెడు
కొత్తిమీర తరుగు - రెండు స్పూనులు
నూనె - తగినంత
ఉప్పు - రుచికి సరిపడా

వేడినీళ్లలో నానబెట్టిన ఓట్స్ వడపోసి, అందులో శెనగపిండి, బియ్యంపిండి, ఉప్పు వేసి బాగా కలపాలి.



అందులో ఉల్లి తరుగు, కొత్తిమీరు తరుగు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి వేసి బాగా కలపాలి.



స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి వేడెక్కాక మిశ్రమాన్ని పకోడీలా వేయాలి.



బంగారు రంగులోకి మారాక తీసి గిన్నెలో వేసుకోవాలి.



వీటి రుచి సాధారణ పకోడీల కన్నా చాలా రుచిగా ఉంటుంది.