యువ హీరో నిఖిల్, దర్శకుడు చందూ మొండేటి కలయికలో వస్తున్న 'కార్తికేయ 2' చిత్ర బృందానికి అరుదైన ఆహ్వానం లభించింది. 'కార్తికేయ 2' చిత్ర బృందాన్ని ఇస్కాన్ అత్యున్నత సంస్థానం బృందావన్‌కు ఆహ్వానం అందింది. నిఖిల్ సహా 'కార్తికేయ 2' చిత్ర బృందంపై ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధా రాందాస్ ప్రశంసల వర్షం కురిపించారు. హీరో నిఖిల్, నటులు శ్రీనివాసరెడ్డి, 'వైవా' హర్ష బృందావన్‌కు వెళ్లారు. నిఖిల్‌తో పాటు వాళ్ళిద్దరూ సినిమాలో నటించారు. బృందావనంలో వైవా హర్ష ఇస్కాన్ టెంపుల్ బృందావనంలో భక్తులతో సెల్ఫీ తీసుకుంటున్న నిఖిల్ నటులు శ్రీనివాసరెడ్డి 'కార్తికేయ 2'లో నిఖిల్ సరసన అనుపమా పరమేశ్వరన్ నటించారు.