నానో బనానా గూగుల్ జెమిని 2.5 ఫ్లాష్ ఇమేజ్ టూల్. రకరకాలుగా ఇమేజ్‌లతో ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటి ట్రెండ్ కటౌట్లు.
ఫోటోను అప్ లోడ్ చేసి 1/7 స్కేల్ రియలిస్టిక్ ఫిగరిన్ అని రాస్తే, AI ఆ ఫోటోను మినీ విగ్రహంగా మార్చి, రియల్ ఎన్విరాన్‌మెంట్‌లో చూపిస్తుంది.
నానో బనానా ఇప్పుడు ట్రెండ్. ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, ఎక్స్‌లో లక్షలాది పోస్ట్‌లు, యూట్యూబ్ ట్యుటోరియల్స్ వచ్చాయి.
ఫిగరిన్స్ చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి – మినీ స్టాచ్యూ లాగా, బేస్ స్టాండ్‌పై ఉంచి, రియల్ వరల్డ్ సెట్టింగ్‌లో (ఉదా: డెస్క్ మీద లేదా రోడ్‌పై) చూపిస్తారు.
గూగుల్ టూల్ ఫ్రీగా అందుబాటులో ఉంది. AI స్టూడియోలో సైన్ ఇన్ చేసి, ఫోటో అప్‌లోడ్ చేస్తే 1-2 నిమిషాల్లో ఇమేజ్ జెనరేట్ అవుతుంది.
ట్రెండ్‌లో సక్సెస్ కోసం స్పెసిఫిక్ ప్రాంప్ట్‌లు కీలకం. ఉదా: Create a 1/7 scale commercialized figurine of the character in the picture, in a realistic style, in a real environment. ఇలాంటివి ఉపయోగించి, ఫోటోను మినీ స్టాచ్యూగా మార్చవచ్చు.
గూగుల్ డీప్‌మైండ్ కొత్త ఇమేజ్ ఎడిటింగ్ మోడల్ 'నానో బనానా' AI, హైపర్-రియలిస్టిక్ 3D ఎఫెక్ట్‌లు క్రియేట్ చేస్తుంది.
ఈ ట్రెండ్ AI క్రియేటివిటీని పాపులర్ చేసింది, కానీ కాపీరైట్ ఇష్యూస్, ప్రైవసీ సమస్యలు విమర్శలకు గురవుతున్నాయి.
గూగుల్ AI స్టూడియోకి వెళ్లి, జెమిని 2.5 ఫ్లాష్ సెలెక్ట్ చేసి, ఫోటో అప్‌లోడ్ చేయండి. ప్రాంప్ట్ ఇచ్చి 'క్రియేట్ ఇమేజెస్' క్లిక్ చేయండి. ఫ్రీగా ట్రై చేసి, సోషల్ మీడియాలో షేర్ చేయవచ్చు
కానీ దేన్ని అయినా పరిమితంగా వాడాలి. అతిగా వాడితే అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.