ఆత్రంగిరే - ధనుష్, సారా అలీఖాన్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా హాట్ స్టార్ లో అవైలబుల్ ఉంది. ఇదొక డిఫరెంట్ లవ్ స్టోరీ. కదశీల బిరియాని - నెట్ ఫ్లిక్ లో ఉన్న ఈ సినిమా రివెంజ్ డ్రామా నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాను కచ్చితంగా చూడాల్సిందే. నాట్యం - అమెజాన్ ప్రైమ్ లో ఉన్న ఈ సినిమా సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. మిన్నల్ మురళి - ఇండియన్ తెరపై వచ్చిన ఈ సూపర్ హీరో సినిమాను మిస్ అవ్వొద్దు. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా టెలికాస్ట్ అవుతోంది. డీకపుల్డ్ - మ్యారేజ్, డివోర్స్, మ్యారిటల్ రిలేషన్స్ వంటి కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సిరీస్ ను ఓ సారి చూసేయండి.. నెట్ ఫ్లిక్స్ లో అవైలబుల్ ఉంది. మానాడు - టైం లూప్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాను చాలా బాగా హ్యాండిల్ చేశారు. సోనీ లివ్ లో ఈ సినిమాను టెలికాస్ట్ చేస్తున్నారు. ది విజిల్ బ్లోవర్ - 2021లో సోనీ లివ్ లో వచ్చిన బెస్ట్ సిరీస్ ఇది. రిపబ్లిక్ - థియేటర్లో విడుదలైన ఈ సినిమా కమర్షియల్ వర్కవుట్ అవ్వన్నప్పటికీ విమర్శకుల ప్రశంసలు దక్కాయి. జీ5లో ఈ సినిమా టెలికాస్ట్ అవుతోంది.