'ఆర్ఆర్ఆర్' సినిమా ఆఖరి నిమిషంలో సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడంతో ఆ గ్యాప్ ను ఫిల్ చేయడానికి చిన్న సినిమాలు వరుసగా విడుదలవుతున్నాయి. 'రాధేశ్యామ్', 'బంగార్రాజు' సినిమాలతో పోటీగా చిన్న సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. 



అతిథి దేవోభవ - ఆది సాయి కుమార్ నటించిన ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.



సూపర్ మచ్చి - మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన ఈ సినిమాను జనవరి 14న విడుదల చేయనున్నారు.



రౌడీ బాయ్స్ - దిల్ రాజు మేనల్లుడు నటించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.



7 డేస్ 6 నైట్స్ - సుమంత్ నటించిన ఈ సినిమా కూడా సంక్రాంతికే రాబోతుంది. 



డీజే టిల్లు - సిద్ధు జొన్నలగడ్డ నటించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నారు.



రాధేశ్యామ్ - సంక్రాంతి బరిలో ఉన్న పెద్ద సినిమా అంటే ఇదే. ప్రభాస్ నటించిన ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కానుంది.



బంగార్రాజు - నాగార్జున నటించిన ఈ సినిమా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.