క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ సీపీయూ పెర్ఫార్మెన్స్‌ను మెరుగుపరచనుంది.

కొత్త అడ్రెనో జీపీయూ గేమింగ్‌ను 25 శాతం వేగంగా మార్చనుంది.

డ్యూయల్ 5జీ + 5జీ మోడ్స్ మెరుగైన కనెక్టివిటీని అందించనుంది.

అంటే రెండు సిమ్ కార్డులూ 5జీని సపోర్ట్ చేయనున్నాయి.

వైఫై 7 ఫీచర్ అందుబాటులోకి రానుంది.

దీని ద్వారా ఇంటర్నెట్ స్పీడ్ 40 జీబీపీఎస్‌కు పెరగనుంది.

డ్యూయల్ బ్లూటూత్ కనెక్టివిటీ ఒకేసారి ఎక్కువ డివైస్‌లను ఫోన్‌కు కనెక్ట్ చేయవచ్చు.

200 మెగాపిక్సెల్ సెన్సార్లను సపోర్ట్ చేయడంతో పాటు రియల్ టైం ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా లభించనుంది.

బిల్ట్ ఇన్ స్పేషియల్ ఆడియో, హెడ్ ట్రాకింగ్ సపోర్ట్ కూడా ఈ ప్రాసెసర్ అందించనుంది.

ఏఐ పెర్ఫార్మెన్స్ కూడా మెరుగవనుంది.