కుజ దోషం, శని దోషం, గురు దోషం తొలగిపోవాలంటే ఇలా చేయండి
విఘ్నాధిపతి అయిన వినాయకుడిని పూజిస్తే తలపెట్టిన పనిలో ఎలాంటి అడ్డంకులు ఉండవంటారు. కేవలం విజయం కోసం మాత్రమే కాదు గ్రహదోష నివారణకు కూడా గణపయ్యను పూజించడం కూడా ఓ పరిష్కారం అని చెబుతారు.
మీకున్న గ్రహదోషాన్ని బట్టి గణనాథుడిని ఆరాధిస్తే ఆ ప్రభావం తగ్గుతుందంటారు పండితులు
సూర్యదోష నివారణకు ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి చంద్ర దోష నివారణకు వెండి లేక పాలరాయితో చేసిన వినాయకుడిని పూజించాలి
కుజదోష నివారణకు రాగితో చేసిన వినాయకుడిని పూజిస్తే ఫలితం ఉంటుంది బుధ దోష నివారణకు మరకత గణపతిని అర్చించాలి
గురు దోష నివారణకు పసుపు,చందనం లేదా బంగారంతో చేసిన గణపతిని కొలవాలి శుక్ర దోష నివారణకు స్ఫటిక గణపతికి ఆరాధించాలి
శని దోష నివారణకు నల్లరాయిపై చెక్కిన గణపతిని పూజించాలి రాహు గ్రహ దోషానికి మట్టితో చేసిన గణపతిని పుజిస్తే ఫలితం ఉంటుంది
కేతు గ్రహ దోష నివారణకు తెల్ల జిల్లేడుతో చేసిన గణపతిని పూజించాలి ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు ఉండవు
పగడపు గణపతిని పూజించడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి పాలరాయితో చేసిన గణపతిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది
సమస్యలు తొలగిపోవాలంటే శ్వేతార్క గణపతిని పూజించాలి స్ఫటిక గణపతిని పూజిస్తే సుఖశాంతులను ప్రసాదిస్తాడు