చాలా మంది హీరోయిన్లకు తాము ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాం అని బహిరంగంగా చెప్పే ధైర్యం ఉండదు. కానీ శ్రుతి హాసన్ డిఫరెంట్.
‘అవును నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను, అందులో తప్పేముంది. ఎవరైనా హీరోయిన్లు మాకు ఇలాంటి సర్జరీలు నచ్చవు అని చెప్పినా మీరు నమ్మకండి’ అంటూ ఓసారి ఇన్ స్టా లో పోస్టు కూడా పెట్టింది.
‘నేను ఎవరికీ నా అందం గురించి ట్రోల్ చేసే అవకాశం ఇవ్వదలచుకోలేదు. అందుకే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను’ అని కూడా చెప్పుకొచ్చింది శ్రుతి.
ఇంతకీ ఆమె ఏ భాగంలో సర్జరీ చేయించుకుందో తెలుసా? పెదవులకి. సర్జరీ కి ముందు ఆమె పెదవులు పల్చగా, ఉన్నాయా లేవా అన్నట్టు ఉండేవి. తరువాత పెదవులు బాగా కనిపించేలా ఫిల్లింగ్ చేయించుకుంది.
‘ఇది నా జీవితం, నా ముఖం... సర్జరీ చేయించుకున్నా అని చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడాలి?’ అని తిరిగి సమాజాన్నే ప్రశ్నించింది ఈ సౌతిండియన్ అందం.
‘నేను చేయించుకున్నా కదా అని, అలాంటి సర్జరీలకు నేను మద్దతు ఇస్తున్నట్టు కాదు, అలాగని వ్యతిరేకిస్తున్నట్టు కాదు’ అని చెప్పుకొచ్చింది.
సన్నని మెరుపుతీగలా కనిపించే శ్రుతి హాసన్ మానసికంగా కూడా చాలా గట్టిదే. అందుకే ప్లాస్టిక్ సర్జరీ గురించి అంతా పబ్లిక్ గా చెప్పేసింది.