టాలీవుడ్‌లో చిన్న తారగా అడుగుపెట్టి టాప్ హీరోయిన్ స్థాయికి చేరిన తారల్లో ఒకరు తమన్నా. తమన్నాకు బాలీవుడ్‌లో కంటే ఎక్కువ గుర్తింపు టాలీవుడ్‌లోనే వచ్చింది. తమన్నా 10 ఏళ్ల నుంచే మేకప్ వేసింది. అయితే, సినిమాల్లో కాదు నాటకాల్లో. తమ్మూ 13వ ఏటలో సినిమాల్లో అడుగు పెట్టింది. సినిమాల్లోకి రాక ముందు నుంచే తమ్మూ పలు వాణిజ్య ప్రకటనల్లో నటించింది. తమన్నాకు 15 ఏళ్లు ఉన్నప్పుడు ‘చాంద్ సా రోషన్ చెహ్రా’ సినిమాలో నటించింది. కానీ హిట్ కాలేదు. 16 ఏళ్ల వయస్సులో తమ్మూ టాలీవుడ్‌లో ‘శ్రీ’, తమిళ్‌లో ‘కేడీ’ సినిమాల్లో నటించింది. 17 ఏళ్ల వయస్సులో ఎస్.జే.సూర్య నటించిన ‘వ్యాపారి’లో మెరిసింది. శేఖర్ కమ్ముల ‘హ్యాపీడేస్’ తర్వాత తమన్నాకు అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం తమన్నా ‘ఎఫ్ 3’ సినిమాతో అందాల విందుకు సిద్ధమవుతోంది. తమన్నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. బాల్యంలోనే ఆమె డ్యాన్స్‌లో తర్ఫీదు పొందింది.