కార్తికేయ హీరోగా నటించిన 'రాజా విక్రమార్క' శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? ఎవరు ఎలా చేశారు? చూడండి.
ప్రశాంత్ ఆర్. విహారి నేపథ్య సంగీతం బావుంది. రాజాగారు వేటకొస్తే..., రామా కనవేమిరా పాటలు వైవిధ్యంగా ఉన్నాయి. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి.
సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాత రామారెడ్డి, ప్రజెంటర్ ఆదిరెడ్డి నిర్మాణ విలువలు హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి.
దర్శకుడు శ్రీ సరిపల్లి ఎంపిక చేసుకున్న పాయింట్ బావుంది. కానీ, ట్రీట్మెంట్ - స్క్రీన్ ప్లే బాలేదు. అసలు కథ సెకండాఫ్ లో మొదలవుతుంది. అందుకని, ఫస్టాఫ్ లో కథ లేకున్నా ఎక్కువ సేపు చూసిన ఫీలింగ్ ఉంటుంది.
నక్సలైట్ పాత్రలో పశుపతి కనిపించారు. పాత్రకు ఆయన పర్ఫెక్ట్ యాప్ట్.
హోమ్ మంత్రిగా, అంతకు ముందు పోలీస్ అధికారిగా పని చేసిన వ్యక్తిగా సాయి కుమార్ నటించారు. పోలీస్ స్టోరీ ఇమేజ్ వల్ల ఆయన చేసిన పోలీస్ ఎపిసోడ్ నమ్మశక్యంగా ఉంది. నటుడిగా సాయి కుమార్ బాగా చేశారు.
ఎన్.ఐ.ఎ అధికారిగా తనికెళ్ల భరణి కనిపించారు. నటనలో ఆయన అనుభవం కనిపించింది.
సినిమాలో సుధాకర్ కోమాకుల ఇంపార్టెంట్ రోల్ చేశారు. మొదట సాధారణంగా కనిపించినా... క్యారెక్టర్ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత నటనలో వైవిధ్యం చూపించారు.
క్లాసికల్ డ్యాన్స్ సీక్వెన్స్‌లో తాన్య అందంగా కనిపించారు.
హీరో హీరోయిన్ల మధ్య ప్రేమకథ రొటీన్‌గా ఉందని అని చెప్పాలి. అందువల్ల, ఫస్టాఫ్ సోసోగా ఉంటుంది.
ఓ సన్నివేశంలో కార్తికేయ సిక్స్ ప్యాక్ చూపించారు.
ఎన్.ఐ.ఎ ఏజెంట్‌గా యాక్షన్ సీన్స్‌లో కార్తికేయ బాగా చేశారు. సినిమాలో యాక్షన్ సీన్స్ స్టయిలిష్‌గా ఉన్నాయి.
సినిమాలో తన పాత్రకు కార్తికేయ 100 శాతం న్యాయం చేశారు. అందంగా కనిపించారు. ఆయన కామెడీ టైమింగ్ బావుంది. అయితే... దర్శకుడు కామెడీ సీన్స్ మీద మరింత కాన్సంట్రేట్ చేయాల్సింది. ఎన్.ఐజ.ఎ ఏజెంట్‌గా హీరోను పరిచయం చేసి... తర్వాత కామెడీగా చూపించడం అందరికీ నచ్చకపోవచ్చు. అయితే, కార్తికేయ కన్విక్షన్‌తో చేశారు.
ప్రేమకథ రొటీన్‌గా ఉండటంతో ఫస్టాఫ్ సోసోగా ఉంటుంది. అసలు కథ సెకండాఫ్‌లో స్టార్ట్ అవుతుంది. అప్పుడు కథలో వేగం పెరుగుతుంది. సెకండాఫ్‌లో యాక్షన్ సీన్లు, కథలో ట్విస్టులు డీసెంట్‌గా ఉన్నాయి. సినిమాలో పాటలు, ఫైటులు బావున్నాయి. స్టయిలిష్‌గా తీశారు.