ఒక్కొక్కరూ ఒక్కో రంగును ఇష్టపడతారు. మనస్తత్వవేత్తల అభిప్రాయం ప్రకారం ఇష్టపడే రంగులను బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయచ్చు.
ఎరుపు
ఎరుపు ఇష్టపడేవారికి ఏకాగ్రత ఎక్కువ. ఏ విషయంలోనైనా తడబాటుకు గురికాకుండా నిశ్చయంగా ఉంటారు. కానీ ఊహించని పనులు చేసి పక్కవాళ్లని ఆశ్చర్యపరుస్తుంటారు. వీరు నాయకులుగా మారతారు.
గులాబీ రంగు
వీరు చమత్కారులు. కామెడీతో నవ్విస్తుంటారు. వీరికి జాలి ఎక్కువ. ప్రశాంతంగా ఉండడాన్ని ఇష్టపడతారు.
నారింజ
ఈ రంగును ఇష్టపడేవాళ్లు చాలా ఆశావాదులుగా ఉంటారు. వీరంటే ఎక్కువ మంది ఇష్టపడతారు. సోషల్ లైఫ్ ని ఇష్టపడతారు.
ఆకుపచ్చ
ప్రకృతిని ఇష్టపడేవాళ్లంతా ఆకుపచ్చ రంగును ఇష్టపడతారు. చుట్టూ పరిసరాలు పచ్చగా ఉంచేందుకు ప్రయత్నిస్తారు. చిన్నచిన్న విషయాలను పట్టించుకోరు.
నీలం
నిజాయితీ గల ప్రేమికులు, మంచి స్నేహితులు వీళ్లు. తమకంటే తాము ప్రేమించిన వారికే ఎక్కువ విలువ ఇస్తారు. స్నేహపూర్వకంగా ఉంటారు.
బూడిద రంగు
ఈ రంగును ఇష్టపడేవారు తక్కువమందే ఉంటారు. వీళ్లు చాలా కంపోజ్ గా, ప్రశాంతంగా ఉంటారు. సహోద్యోగులతో పనిచేసేటప్పుడు హద్దులు గీసుకుంటారు. సొంతవ్యాపారాన్ని చూసుకోవడానికి ఇష్టపడతారు.
నలుపు
ఈ రంగును ఇష్టపడేవారు ప్రైవసీని కోరుకుంటారు. మర్యాదపూర్వకంగా ఉంటారు. స్వీయనియంత్రణ కూడా ఎక్కువ. పనులు సరైన మార్గంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. అడ్డదారులు తొక్కరు.
తెలుపు
ఈ రంగును ఇష్టపడేవారు ప్రతిది సులువుగా ఉండాలని, అలాగే ఓ క్రమపద్ధతిలో జరగాలని కోరుకుంటారు. వీళ్లకి స్వీయ నియంత్రణ ఎక్కువ. కానీ దానివల్లే ‘ఎవరితోనూ మాట్లాడరు, తనలో తానే ఉంటారు’ లాంటి మాటలు ఎదుర్కోవలసి వస్తుంది.
ఊదా రంగు
ఊదారంగు ఇష్టపడేవారు జీవితంలో భావోద్వేగపూరితంగా ఉంటారు. మంచి పరిశీలకులు, సృజనాత్మకంగా ఆలోచిస్తారు. వీరికి అద్భుతమైన అంతర్ దృష్టి ఉంటుంది. కాకపోతే చెడు వ్యక్తులకు త్వరగా ఆకర్షితులవుతారు.