మ్యూచువల్ ఫండ్స్.. భవిష్యత్తు గురించి ఆలోచించే చాలామంది వీటిలో ఇన్వెస్ట్ చేస్తుంటారు ఈ మధ్య హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ కి డిమాండ్ పెరిగిందంటున్నారు ఫైనాన్షియల్ ఎక్స్ పర్ట్స్ 2024లో వీటిలో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య 37 శాతం పెరిగింది. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ అంటే ఈక్విటీ (షేర్లు), డెట్ (బాండ్లు) రెండిట్లో ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం అందరరి చూపు హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ వైపు తిరగడానికి కారణం.. ట్యాక్స్ బెనిఫిట్స్ 2023 ఏప్రిల్‌లో, డెట్ ఫండ్స్‌కు సంబంధించిన ట్యాక్స్ రూల్స్ మారడంతో చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తక్కువ రిస్క్ తీసుకోగల పెట్టుబడిదార్లకు హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ మంచి ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ గత ఆర్థిక సంవత్సరంలో, మొదటి 10 నెలల్లో హైబ్రిడ్ ఫండ్స్ నుంచి పెట్టుబడులు వెనక్కు వెళ్లాయి. ఇప్పుడు ఈ ట్రెండ్ రివర్స్‌లో ఉంది. 2024 జనవరిలో, ఈ ఫండ్స్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 20 వేల కోట్లకు పైగా సేకరించినట్లు లెక్కలు చెప్తున్నాయి. గమనిక: పెట్టుబడి పెట్టే ముందు, ఉపసంహరించుకునే ముందు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహా తీసుకోవాలి.