నల్లీ బోన్స్ - నాలుగు ఉల్లిపాయ తరుగు - ఒక కప్పు పసుపు - చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూనులు టోమాటో ప్యూరీ - అరకప్పు మిరియాల పొడి - అర చెంచా దాల్చిన చెక్క - రెండు ముక్కలు
యాలకులు - రెండు లవంగాలు - అయిదు ధనియాల పొడి - పావు చెంచా కారం - ఒక స్పూను జాజికాయ పొడి - చిటికెడు బిర్యానీ ఆకులు - రెండు ఉప్పు - రుచికి సరిపడా నూనె - తగినంత
నల్లీ బోన్స్,నాలుగు స్పూన్ల ఉల్లి తరుగు, కాస్త నూనె, అల్లం వెల్లుల్లి పేస్టు, నీళ్లు, పసుపు, ఉప్పు వేసి కలిపి కుక్కర్లో పెట్టి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి.
మిక్సీజార్లో ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, లవంగాలు, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, జాజికాయ పొడి, కాస్త నీళ్లు వేసి మెత్తనిపేస్టులా చేసుకోవాలి.
ఈలోపు కళాయిలో బిర్యానీ ఆకులు, ఉల్లితరుగు వేసి వేయించాలి.
తరువాత మిక్సిలో చేసిన మసాలా పేస్టు, టమోటా ప్యూరీ వేసుకుని వేయించాలి.
అన్నీ వేగాక కారం, పసుపు, ధనియాల పొడి వేసి వేయించాలి.
తరువాత కుక్కర్లో ఉడికించుకున్న నల్లీ బోన్స్ మిశ్రమాన్ని వేసి ఉడికించాలి.