కొనుగోలు దారుల్లో చైతన్యం కోసం సెంట్రల్ గవర్నమెంటు కొత్త స్కీమ్ తీసుకొచ్చింది.



'మేరా బిల్ మేరా అధికార్' స్కీమ్ తెచ్చింది.



ఏ వస్తువు కొనుగోలు చేసినా బిల్లు తీసుకోవడం నేర్పించాలన్నదే దీని ఉద్దేశం.



మీ రిసిప్టును www.merabill.gst.gov.in అప్లోడ్ చేస్తే చాలు. లక్కీ డ్రాలో మీ బిల్లు ఎంపికైతే డబ్బులు ఇస్తారు.



ప్రతి నెలలో తీసుకున్న రిసిప్ట్‌ను ఆ తర్వాతి నెల 5వ తేదీ కల్లా అప్‌లోడ్‌ చేస్తే అర్హత పొందినట్లే.



రిసిప్ట్‌ తీసుకున్న వ్యక్తి వివరాలు ఇవ్వాలి. ఒక నెలలో 25 వరకు అప్‌లోడ్‌ చేయొచ్చు. వాటిపై GSTN ఉండాలి.



ముందుగా 800 రశీదులను ఎంపిక చేసి రూ.10 వేల చొప్పున ప్రైజ్‌ మనీ ఇస్తారు.



ఆపై మరో 10 రిసిప్ట్స్‌ను తీసి ఒక్కో దానికి రూ.10 లక్షల చొప్పున బహుమతి అందిస్తారు.



ప్రతి 3 నెలలకు ఒకసారి బంపర్‌ డ్రా తీసి గెలిచిన వారికి రూ. కోటి అందజేస్తారు.



విజేతలు పాన్‌, ఆధార్‌ కార్డ్‌, బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలి.