శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు. అందులో 2 సూర్య గ్రహణాలు, 2 చంద్ర గ్రహణాలున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే తొలి సూర్యగ్రహణం ఏర్పడగా.. మొదటి చంద్రగ్రహణం మే 5 న ఏర్పడబోతోంది.
చంద్రుడు, సూర్యుడి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణం ప్రభావం 12 రాశులపైనా ఉంటుంది.
కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం ఉంటే మరికొన్ని రాశులపై అనుకూల ప్రభావం ఉంటుంది. మే 5న రానున్న చంద్రగ్రహణం ఈ మూడు రాశులవారికి అదృష్టాన్ని తీసుకొస్తోంది.
చంద్రగ్రహణం మిథున రాశివారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులు పదోన్నతి పొందుతారు. మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు.
చంద్రగ్రహణం సింహరాశివారికి అనుకూల ఫలితాలనిస్తోంది. కొత్తగా ఏదైనా ప్రాజెక్ట ప్రారంభించేందుకు, నూతన ప్రణాళికలు అమలుచేసేందుకు ఇది మంచి సమయం. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి..అన్నింటా మంచి ఫలితాలు పొందుతారు.
చంద్రగ్రహణం మకరరాశివారికి ఆర్థిక లాభాలను తెచ్చిపెడుతోంది. స్థిరాస్తులు వృద్ది చేస్తారు, వాహన యోగం కూడా ఉంది. నూతన ప్రణాళికలు అమలుచేసేందుకు అనుకూల సమయం. ఉద్యోగస్తులకు పదవులు, ప్రతిష్టలు పెరుగుతాయి.
ఈ ఏడాది ఏర్పడే తొలి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. అందుకే సూతక కాలం పాటించాల్సిన అవసరం లేదు.
గమనిక: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.