నిత్యానంద స్వామి

ఉత్తరాఖండ్ మొదటి సీఎం. ఉత్తరాంచల్‌ను ఉత్తరాఖండ్‌గా మార్చింది ఈయనే. నవంబర్‌9 2000 నుంచి అక్టోబర్‌ 29 2001 వరకు సీఎంగా ఉన్నారు.

భగత్‌ సింగ్

ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్ నేత, రెండో సీఎం, అక్టోబర్‌ 30 2001 నుంచి మార్చి 1 2002 సీఎంగా ఉన్నారు.

ఎన్‌డీ తివారీ

నారాయణదత్‌ తివారీ 2002 నుంచి 2007 వరకు సీఎంగా పని చేశారు. ఈయన ఉత్తర్‌ప్రదేశ్‌కు కూడా మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేశారు.

భవన్‌ చంద్ర ఖండూరీ

రిటైర్డ్‌ మేజర్ జనరల్‌ ఈయన. 2007 నుంచి 2009 వరకు, 2011 నుంచి 2012 వరకు సీఎం

రమేష్‌ పోఖ్రీయాల్‌

ఐదో ముఖ్యమంత్రి, 2009-2011 మధ్య పని చేశారు.

విజయ బుహుగుణ

2012 మార్చి 13న సీఎంగా ప్రమాణం చేసి 2014 జనవరి 31న రిజైన్ చేశారు.

హరీష్‌ రావత్‌

2014- 17 మధ్య సీఎంగా ఉన్నారు. ఈ టైంలోనే ఉత్తరాఖండ్‌లో మూడుసార్లు రాష్ట్రపతి పాలన పెట్టారు.

త్రివేంద్రసింగ్ రావత్

2017-2021 మధ్య సీఎంగా పని చేసిన బీజేపీ లీడర్

తిరాథ్ సింగ్‌ రావత్

మార్చి 10 2021-జులై 2 2021 మధ్య సీఎంగా పని చేశారు.

పుష్కర్ సింగ్ ధామి

2021-జులై 2 2021 నుంచి నేటి వరకు సీఎంగా ఉన్నారు.