వీళ్లే అతిరథ మహారథులు



అతిరథమహారథులు అంటే వ్యక్తుల పేర్లు కాదు...పురాణాల్లో కొన్ని పాత్రల యుద్ధనైపుణ్యాన్ని, యుద్ధంలో పాల్గొనే యోధుల సామర్ధ్యాన్ని తెలుపుతాయి. వాళ్లవరో, వారి సామర్థ్యం ఏంటో తెలిపేందుకు ఇందులో 5 స్థాయులున్నాయి.



1)రథి
2)అతిరథి
3)మహారథి
4)అతి మహారథి
5) మహామహారథి



రథి: ఏకకాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలవారిని రథి అని అంటారు. సోమదత్తుడు, సుదక్షిణ, శకుని, శిశుపాల, పాటు కౌరవుల్లో 96 మంది, శిఖండి, ఉత్తమౌజులు, ఉపపాండవులు వీరందరూ రథులు.



అతిరథి : రథికి 12రెట్లు అంటే ఏకకాలంలో 60,000మందితో ఒకేసారి యుద్ధం చేయగలవారిని అతిరథి అని అంటారు. లవకుశులు, కృతవర్మ, శల్య, కృపాచార్య, ఘటోత్కచ, ప్రహస్త, అంగద, దుర్యోధన, యుధిష్ఠిర, నకుల, సహదేవ, ప్రద్యుమ్నులు వీరంతా అతిరథులు.



మహారథి : అతిరథికి 12రెట్లు.. అంటే 7,20,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగల వీరుడిని మహారథి అని అంటారు.



రాముడు, కృష్ణుడు, లక్ష్మణుడు , అభిమన్యుడు, వాలి, అంగద, అశ్వత్థామ, అతికాయ, భీమ, కర్ణ, అర్జున, భీష్మ, ద్రోణ, కుంభకర్ణ, సుగ్రీవ, జాంబవంత, రావణ, భగదత్త, నరకాసుర, లక్ష్మణ, బలరామ, జరాసంధుడు తదితర వీరులంతా మహారథుల కోవలోకి వస్తారు.



అతిమహారథి : మహారథికి 12రెట్లు అంటే 86,40,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగల వీరుడిని అతిమహారథుడు అని అంటారు. ఇంద్రజిత్తు, పరశురాముడు, ఆంజనేయుడు, వీరభద్రుడు, భైరవుడు వీరంతా అతి మహారథులు.



మహామహారథి: అతిమహారథికి 24రెట్లు అంటే ఏకకాలంలో 20,73,60,000 మందితో ఏకకాలంలో యుద్ధం చేయగల వీరుడిని మహామహారథి అని అంటారు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు, దుర్గాదేవి, గణపతి , సుబ్రహ్మణ్య స్వామి వస్తారు.



అతిరథమహారథులు అనే పదం వాడుక భాషలోకి వచ్చేసరికి ..ఎంతో గొప్పవాళ్లకి వినియోగిస్తుంటారు. అలా ఈ పదానికి అర్థం చాలామందికి తెలియకపోయినా ఉపయోగించేవారి సంఖ్య మాత్రం ఎక్కువే....


Thanks for Reading. UP NEXT

అంగస్తంభనకు బీట్‌రూట్, ఈ సమస్యలన్నీ పరార్!

View next story