బీట్‌రూట్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో చూసేయండి మరి. బీట్ రూట్ లో బెలాటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ లభిస్తుంది. ఇది క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుంది. బీట్ రూట్లో కొవ్వు ఉండదు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక. రక్తహీనత, ఎనిమియాతో బాధపడుతున్న స్త్రీలు రోజూ బీట్ రూట్ జ్యూస్ తాగితే మంచి ఫలితం ఉంటుంది. బీట్‌రూట్‌లో పొటాషియం, ఫోలేట్ నిల్వలు అధికం. గర్భిణులు తింటే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది. బీట్ రూట్ విటమిన్, బి, సి లు పుష్కలంగా ఉన్నాయి. ఇది తింటే చర్మం మెరిసిపోవడం ఖాయం. బీట్ రూట్ లైంగిక సామర్ధ్యాన్ని పెంచుతుంది. వారానికి 2 సార్లు బీట్ రూట్ జ్యూసు లేదా కూర తీసుకోవాలి. బీట్‌రూట్ శరీరంలో రక్త నాళాలను విస్తరింపజేసే నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ అంగస్తంభన అవసరమైన కార్పస్ కావెర్నోసమ్‌లో ఒత్తిడి తెచ్చేందుకు సహకరిస్తుంది. మూడ్‌ను రీఫ్రెష్ చేయడంలో ఈ దుంప ముందుంటుంది. మూడీగా ఉండే వారు దీని రసం తాగితే ఉత్సాహంగా ఉంటారు. డీ హైడ్రేషన్ బాధితులకు బీట్ రూట్ ఒక వరం. శరీరానికి అవసరమైన నీటి శాతాన్ని ఇది అందిస్తుంది. Images Credit: Pixabay and Pixels