ఖాళీ కడుపుతో కాఫీ తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

ఖాళీ కడుపులో కాఫీ తాగితే గ్యాస్ట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. కడుపు మంట, అసౌకర్యం కలగవచ్చు.

కాఫీ కడుపు లైనింగ్‌ను ఇరిటేట్ చేస్తుంది. దీని వల్ల డైజెషన్ సమస్యలు వస్తాయి.

ఉదయాన్నే కాఫీ తాగితే స్ట్రెస్ హార్మోన్ పెరిగి ఆందోళన పెరగవచ్చు.

ఖాళీ కడుపులో కాఫీ తాగడం వల్ల చేతులు వణకడం, టెన్షన్ ఫీల్ అవడం జరుగుతుంది.

కాఫీ వల్ల షుగర్ లెవెల్స్ మారిపోవచ్చు. దీని వల్ల అలసట, ఆకలి పెరుగుతుంది.

కాఫీలోని కెఫిన్ గుండె వేగంగా కొట్టుకోవడం వంటి ఫీలింగ్ ఇస్తుంది.

కాఫీ శరీరంలోని నీటి శాతాన్ని తగ్గించి.. డీహైడ్రేషన్ సమస్యను పెంచుతుంది.

ఇప్పటికే గ్యాస్ట్రిక్ లేదా అల్సర్ ఉన్నవారికి సమస్యలు ఎక్కువ అవుతాయి.

ఎనర్జీ ఒక్కసారిగా పెరిగి మళ్లీ తగ్గిపోవడం వల్ల మూడ్ మార్పులు వస్తాయి.

కాఫీ తాగేముందు చిన్నగా ఏదైనా తినడం మంచిది. ఇలా చేస్తే ఈ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి.