బ్రెయిన్ స్ట్రోక్ ముందు శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

బ్రెయిన్ స్టోక్ వల్ల మరణం కూడా సంభవించవచ్చు. మెదడులో రక్తస్రావం కాకముందే శరీరం తరచుగా స్పష్టమైన సంకేతాలను ఇస్తుంది.

అది ముందుగానే గుర్తిస్తే స్ట్రోక్ తీవ్రతను నివారించవచ్చు. దీనివల్ల మరణ ప్రమాదం తగ్గుతుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం స్ట్రోక్ రోగికి మొదటి 3 నుంచి 4 గంటలలో చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చని తెలుస్తోంది.

ముఖం, చేతులు లేదా కాళ్లలో అకస్మాత్తుగా బలహీనత, అకస్మాత్తుగా గందరగోళం, లేదా మాట్లాడటంలో లేదా మాటలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది ఉంటే చెక్ చేసుకోవాలి.

మెదడుకు రక్త సరఫరా ఆగిపోయినప్పుడు లేదా తగ్గినప్పుడు స్ట్రోక్ వస్తుంది, దీనివల్ల మెదడుకు ఆక్సిజన్, పోషకాలు అందకుండా పోతాయి.

ఇది మెదడు కణాలకు నష్టం కలిగించవచ్చు. మెదడు పనితీరును తగ్గించవచ్చు.

ముఖం, చేయి లేదా కాలు బలహీనంగా మారడం, తిమ్మిరి, తీవ్రమైన తలనొప్పి, మాట్లాడటంలో ఇబ్బంది వంటివి ఉంటాయి.

అది కాకుండా దృష్టి తగ్గడం, అస్పష్టమైన దృష్టి లేదా దృష్టి కోల్పోవడం, మైకం, నిద్రలేమి మొదలైనవి దీని లక్షణాలు.

మెదడులో రక్తస్రావం రాకుండా ఉండటానికి తక్కువ కొవ్వు, తక్కువ ఉప్పు, ఎక్కువ ఫైబర్ కలిగిన ఆహారం తీసుకోండి.

ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్య సహాయం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.