దీపావళికి ముందు ఇంటిని శుభ్రపరచడం అనేది ముఖ్యమైన పని. శుభ్రమైన ఇల్లు సానుకూల శక్తిని ఇస్తుంది. అలంకరణలు వేడుకలకు ఇంటిని సిద్ధం చేస్తుంది.
ఒకేసారి మొత్తం ఇంటిని శుభ్రం చేయడానికి బదులుగా.. ఇంటి విభజించండి. ఈ పద్ధతి సమయాన్ని ఆదా చేస్తుంది. మరింత ఎఫెక్టివ్గా క్లీన్ చేసుకోవచ్చు.
ఇంటి పైకప్పు మూలలు, ఫ్యాన్లు, లైట్ ఫిట్టింగులు, ఎత్తైన అరలతో పని ప్రారంభించండి. దుమ్ము కిందికి పడుతుంది. కాబట్టి పైన నుంచి శుభ్రం చేస్తే డబుల్ పని ఉండదు.
మీరు కిటికీలు, అద్దాలు, వాటికి ఉన్న గాజు ఉపరితలాలను శుభ్రం చేయడానికి నీరు, వెనిగర్ ఉపయోగించవచ్చు. ఇది మరకలు, దుమ్ము, మురికిని దూరం చేస్తుంది.
తెరలు, కుషన్ కవర్లు, సోఫాపై ఉన్న కవర్స్ ఉతకండి. లేదా డ్రై క్లీన్ చేయండి. ఉతికిన దుస్తులు ఇంటిని ప్రకాశవంతంగా చేస్తాయి. పండుగ శోభను పెంచుతాయి.
అల్మారాలు, అరలను తెరిచి లోపలి దుమ్మును తుడవండి. మూలలను కూడా విస్మరించకూడదు.
ఇంటి ప్రవేశ ద్వారం శుభ్రం చేయండి. అవసరమైతే తలుపులకు రంగులు వేయండి. లేదా పాలిష్ చేయండి.
వాసనలను తొలగించడానికి కార్పెట్‌లు లేదా రగ్గులపై బేకింగ్ సోడా చల్లండి. తాజాగా శుభ్రమైన వాసన కోసం వాక్యూమ్ చేయడానికి ముందు కొన్ని నిమిషాలు అలాగే ఉంచండి.
ఇంటిని శుభ్రపరిచిన తరువాత మీ ఫర్నిచర్ అలంకరణలు, పండుగ వస్తువులను చక్కగా అమర్చండి. ఇల్లు చిందవందర లేకుండా సర్ది ఉంటే.. చాలా ప్రశాంతంగా ఉంటుందని గుర్తించుకోండి.