మెదడు, మనసును ప్రశాంతంగా ఉంచే చిట్కాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

ఆందోళన లేదా ఒత్తిడి పెరిగినప్పుడు డీప్ బ్రీత్ తీసుకుని వదలడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది టెన్షన్‌ను కూడా తగ్గిస్తుంది.

పార్క్‌లో నడవడం, చెట్ల మధ్య కూర్చోవడం లేదా ప్రకృతిని ఆస్వాదించడం మానసిక ప్రశాంతతను పెంచుతుంది.

రోజుకు 10 నుంచి 15 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల నెగిటివ్ ఆలోచనలను నియంత్రించుకోవడం సులభమవుతుంది.

నిద్రలేమి మనసును మరింత అస్థిరంగా మారుస్తుంది. ప్రతిరోజూ 7-9 గంటల నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోండి.

ఎక్కువసేపు ఫోన్, సోషల్ మీడియా ఉపయోగించడం మానసిక ఒత్తిడిని పెరగవచ్చు. కాబట్టి రోజులో కొంత సమయం డిజిటల్ డిటాక్స్‌కు చేయండి.

నడక, యోగా లేదా ఇతర వ్యాయామాలు చేయడం వల్ల ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలై మనసు ప్రశాంతంగా ఉంటుంది.

ప్రతిరోజూ మీ జీవితంలో ఉన్న మంచి విషయాలను గుర్తు చేసుకోవడం వల్ల నెగెటివ్ ఆలోచనలు తగ్గి సానుకూల దృక్పథం పెరుగుతుంది.

మల్టీటాస్కింగ్ వల్ల ఒత్తిడి పెరగవచ్చు. కాబట్టి ఒక్క పనిపై దృష్టి పెట్టి పూర్తి చేయడం మంచిది.

పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, పెయింటింగ్ లేదా తోటపని వంటి హాబీలు మనసుకు విశ్రాంతిని ఇస్తాయి.

కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా నిపుణులతో ఫీలింగ్స్ పంచుకోవడం ద్వారా మానసిక భారం తగ్గుతుంది.