రాత్రుళ్లు నిద్ర మానుకుని మొబైల్ చూడడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి.

బ్లూ లైట్ వల్ల నిద్ర సమస్యలు పెరుగుతాయి. మెలటోనిన్ తగ్గుతుంది.

దీనివల్ల ఇన్సోమియా, నిద్ర నాణ్యత తగ్గడం వంటివి జరుగుతాయి.

కళ్లు అలసిపోతాయి. పొడిబారిపోవడం వల్ల నిద్ర రాదు.

కళ్లు మందగించడం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి.

సరైన నిద్ర లేకుంటే నెక్స్ట్ డే అంతా నీరసంగా ఉంటుంది.

ఒత్తిడి, యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలు పెరుగుతాయి.

దీర్ఘకాలికంగా నిద్ర సమస్యతో ఇబ్బంది పడితే దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి.

అధిక బరువు పెరగడానికి నిద్ర లేమినే కారణం.

కాబట్టి రాత్రుళ్లు మొబైల్ ఎక్కువ సేపు వినియోగించకపోవడమే మంచిది.