మౌంటైన్స్​కి ట్రెక్​కి వెళ్లాలంటే తీసుకోవాల్సి జాగ్రత్తలివే

పర్వతారోహణకు వెళ్లేముందు వాతావరణ కండీషన్స్​ని కచ్చితంగా చెక్ చేసుకోవాలి.

తుఫాను, స్నో ఫాల్ సమయంలో వెళ్లకపోవడమే మంచిది.

మౌంటైన్​కి వెళ్లేప్పుడు డ్రెస్​లు పర్​ఫెక్ట్​గా సెట్​ అయ్యేవి ప్యాక్ చేసుకోవాలి.

లేయర్లుగా డ్రెస్​ వేసుకోవాలి. థర్మల్స్, వాటర్​ప్రూఫ్ జాకెట్స్, గ్లౌవ్​లు, షూలు ప్యాక్ చేసుకోవాలి.

ఆక్సిజన్ స్థాయిలను సర్దుబాటు చేసుకోవడానికి మధ్యస్థంగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువ గడపండి.

వాటర్​, స్నాక్, బేసిక్ ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫ్లాష్ లైట్​, బ్యాటరీ, పవర్ బ్యాంక్ , మ్యాప్ కచ్చితంగా తీసుకోవాలి.

వాటర్ తాగుతూ ఉండాలి. హైడ్రేషన్ ముఖ్యం. ఎక్కువ శక్తిని అందించే ఫుడ్స్ తీసుకోవాలి.

మీ ట్రిప్​ గురించి ఎవరికైనా కచ్చితంగా ఇన్​ఫార్మ్ చేస్తే మంచిదని గుర్తించుకోవాలి.

శారీరకంగా ఫిట్​గా ఉన్నారో లేదో తెలుసుకుని ట్రెక్​కి వెళ్తే మంచిది.