జలుబు వస్తే వెంటనే మందులు వేసుకోవాలా.. డాక్టర్లు ఏమంటున్నారంటే

Published by: Geddam Vijaya Madhuri

వైరల్ ఇన్ఫెక్షన్లలో యాంటీబయాటిక్స్ పనిచేయవు.

జలుబు కోసం నేరుగా మెడికల్ షాప్ నుంచి మందులు తీసుకోవడం సరైన పద్ధతి కాదని చెప్తున్నారు.

శరీరం రోగనిరోధక శక్తికి సంబంధించిన వైరస్లతో స్వయంగా పోరాడుతుందని తెలిపారు.

సాధారణంగా జలుబు 4 నుంచి 7 రోజులలో తగ్గిపోతుంది.

పసుపు కఫం, జ్వరం వస్తేనే డాక్టర్ సలహా తీసుకోవాలి.

జలుబు చేసినప్పుడు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. అలాగే ఎక్కువ నీరు తాగాలి.

ఆవిరి పట్టడం వల్ల ముక్కు దిబ్బడ, గొంతుకు ఉపశమనం లభిస్తుంది.

వెచ్చని ఉప్పు నీటితో నోటిని పుక్కిలించడం మంచిది.

అధిక జ్వరం ఉంటే డాక్టర్ను సంప్రదించి మాత్రమే మందులు తీసుకోవాలి.