కొత్తిమీరను పచ్చిగా తినవచ్చా?

Published by: Geddam Vijaya Madhuri

పచ్చి కొత్తిమీర రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.

కొత్తిమీరలో విటమిన్ ఎ ఎక్కువ. కళ్ళ ఆరోగ్యానికి చాలా అవసరం.

ఇందులో విటమిన్ సి ఉంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

పచ్చ కొత్తిమీరలో ఎముకలను బలపరిచే విటమిన్ కె ఉంది.

పచ్చ కొత్తిమీరను తీసుకోవడం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

యాంటీఆక్సిడెంట్లు నిండి ఉంది. ఇది శరీర కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తుంది.

కొన్ని పరిశోధనల ప్రకారం కొత్తిమీర రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండెకు మంచిది.

కొత్తిమీర ఆరోగ్యానికి మంచిది అయినప్పటికీ.. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్రదించడం మంచిది.