కళ్లల్లో రోజ్ వాటర్ వేసుకోవచ్చా? ఆ తప్పు చేయకండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

రోజ్ వాటర్​ను ఇండియాలో శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు.

Image Source: pexels

చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి దీనిని చాలామంది ఉపయోగిస్తారు.

Image Source: pexels

అయితే చాలామంది ఉదయం లేవగానే లేదా రోజంతా స్క్రీన్ చూసిన తర్వాత కళ్లల్లో రోజ్ వాటర్ వేసుకుంటారు.

Image Source: pexels

మరి కళ్లల్లో రోజ్ వాటర్ వేసుకోవచ్చా? లేదా? నిపుణులు ఏమంటున్నారంటే

Image Source: pexels

అన్ని బ్రాండ్ల గులాబీ నీరు కళ్ళలో వేసుకోవడానికి అనుకూలంగా కాదు. కేవలం ఆప్తాల్మిక్ గ్రేడ్ రోజ్ వాటర్ మాత్రమే సురక్షితం.

Image Source: pexels

స్టెరిలైజ్డ్ రోజ్ వాటర్ మాత్రమే సురక్షితం. బాటిల్ మీద Sterile for Eye Use అని రాసి ఉంటేనే కళ్లల్లో వేసుకోవచ్చట.

Image Source: pexels

అలాగే చర్మం లేదా సౌందర్య సాధనాల కోసం ఉపయోగించే రోజ్ వాటర్ కళ్లల్లో వేస్తే ఇన్ఫెక్షన్ లేదా చికాకు వస్తాయట.

Image Source: pexels

ఎవరికైతే ఎలర్జీ, డ్రై ఐ లేదా కంజెక్టివిటిస్ వంటి సమస్యలు ఉన్నాయో వారు రోజ్ వాటర్ వేసుకోకూడదు.

Image Source: pexels

అంతేకాకుండా స్వచ్ఛమైన రోజ్ వాటర్ కళ్ల అలసట లేదా తేలికపాటి మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.