గంటలు గంటలు పని చేస్తున్నారా? ప్రాణాలు పోతాయ్ జాగ్రత్త! ఎక్కువ గంటలు పని చేయడం ప్రాణాలకు ప్రమాదం అంటున్నారు వైద్యులు. ఒక్కోసారి ప్రాణాలు పోయే అవకాశం ఉందటున్నారు. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల తీవ్రమైన వ్యాధులు, అకాల మరణాలు పెరుగుతున్నాయట. వారానికి 55 గంటల కంటే ఎక్కువ పని చేస్తే 35 శాతం స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. 35 నుంచి 40 గంటలు పని చేస్తే ఇస్కీమిక్ హార్ట్ ప్రాబ్లంతో చనిపోయే ప్రమాదం 17 శాతం ఎక్కువ. వారానికి 55 గంటలు పనిచేయడం వల్ల ఏటా 8 లక్షల మందికిపైగా మరణిస్తున్నారు. ఎక్కువ పని గంటలతో అధిక బరువు, ప్రీడయాబెటిస్, టైప్ -2 మధుమేహం పెరుగుతాయి. 69 గంటలకు మించి పని చేయడం వల్ల మానసిక సమస్యలు పెరుగుతాయి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com