కాళ్లల్లో ఈ లక్షణాలు కనిపించాయా? డయాబెటిస్ వచ్చినట్టే! డయాబెటిస్ వచ్చినప్పుడు కాళ్లలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. డయాబెటిస్ వల్ల నరాలు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాళ్ళు తిమ్మిరి పట్టడం, మంటలు పుట్టడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయి పెరిగి రక్తనాళాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాళ్ళకు, పాదాలకు రక్తప్రసరణ సరిగా జరగక పుండ్లు ఏర్పపడే అవకాశం ఉంది. ఎముకలు బలహీనంగా మారడం, కీళ్లు దెబ్బ తినడంతో పాటు పాదాలలో పగుళ్లు ఏర్పడుతాయి. ఈ లక్షణాల కనిపించినా నిర్లక్ష్యం చేస్తే గ్యాంగ్రీన్ లాంటి తీవ్ర సమస్యలు వస్తాయి. చివరకు కాలు లేదంటే పాదాన్ని తొలగించే అవకాశం ఉంటుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.All Photos Credit: pexels.com